ప్రజారాజధానిలో వివిధ విభాగాల, కట్టడాల పేర్ల నిర్ణయంలో ప్రజాభిప్రాయానికి పెద్దపీట


                         ఆంధ్రప్రజల ఆశలని నిజం చేస్తూ, భావితరాల భవితవ్యానికి పునాదివేస్తూ, ఒక భారతదేశంలోనే కాదు యావద్ప్రపంచంలోనే నూతననగర నిర్మాణక్రమానికి ఆదర్శమయ్యేలా రూపుదిద్దుకుంటున్న మహానగరం మన అమరావతి. తరతరాల తెలుగువారి తలనగరంగా విలసిల్లిన ధాన్యకటకపు శోభకిదొక నవీన రూపకల్పన. అంతర్జాతీయ నగరజీవన కొలమానాలకి సరితూగే ఆధునిక నగరం. ఐదుకోట్ల ఆంధ్రులంతా రొమ్మువిరిచి గర్వంగా ‘ఈ నగరం నాది’ అని చెప్పుకొనే విధ౦గా తీర్చిదిద్దే బాధ్యత మనందరిదీ. ఇది మన ప్రజారాజధాని. ఇందులో ప్రతి మట్టికణంమనదే, ప్రతి నీటీ బిందువు మనదే. నిర్మాణములో ఉపయోగించే ప్రతి ఇటుకా మనదే, రాయి మనదే. చిగురించే ప్రతి చెట్టు మనదే, పూచే పులపోదా మనదే, చివరికి గడ్డిపరకా మనదే. శ్రమించే ప్రతి చెమట బిందువు మనదే. అంతర్జాతీయ రూపశిల్పులచే ఆధునిక ప్రమాణాలతో రూపొందే ఈ నగరం మన ఆంధ్రుల చారిత్రక వారసత్వానికి అద్దంపట్టేలా ఉండాలని గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయం. అందుకొరకు ప్రభుత్వ సలహాదారు డా. పరకాల ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో, ఒక నిష్ణాతుల సమితికి శ్రీకారం చుట్టారు. ఇందులో భారతీయ చరిత్ర, ముఖ్యంగా ఆంధ్రుల పురాతత్వ, సామజిక, భాషా వారసత్వాలపై ఎన్నో యేళ్ళుగా అహర్నిశలూ శ్రమించిన ఆచార్యులనూ, రచయితలనూ, వాస్తుశిల్పులనూ, సంస్కృతీ పరిరక్షకులను ఒక చోట చేర్చి వారి సలహాలను నార్మన్ ఫాస్టర్ వంటి అంతర్జాతీయ సంస్థలకు అందజేయాలని నిర్ణయించారు. అంతేగాక నూతన రాజధానిలో భాగమైన ప్రాంతీయ విభాగాలకు; రహదారులూ, వీధులూ, కూడళ్ళు, కార్యాలయ భవనాలు, ఉద్యానాలు, క్రీడా౦గణాలూ, కళావేదికలూ, అతిధిగృహాలూ మొదలైన నిర్మాణాలకు మన సంస్కృతికీ,వారసత్వానికి అద్దంపట్టే పేర్లను నిర్ణయించే బాధ్యతను కూడా చేబట్టారు. వివిధ ప్రాంతాలలోని నదులూ, పర్వతాలూ, నైసర్గిక విశేషాలు, చారిత్రక సంఘటనలూ, రాచరికాల పేర్లే గాక, ఆయా ప్రాంతాల చారిత్రక వ్యక్తులు, సమీప భూత కాలములో వివిధ రంగాలలో విశేష ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన ప్రముఖులను కూడా గుర్తించి ఈ ప్రజారాజధానిలో తగిన స్థానము కల్పించాలని నిర్ణయించారు. రాజాధానిలో అంతర్గతంగా రూపొందుతున్న ప్రభుత్వ, న్యాయ, ఆర్ధిక, విద్యా, ఆరోగ్య, పర్యాటక, క్రీడా, సమాచార, సాంకేతిక రంగాల అభివృద్దికై నిర్మితమవుతున్న తొమ్మిది ప్రత్యేక నగరాలలో ఆయా రంగాల్లో విశేష సేవలందించిన వ్యక్తులకు గుర్తింపు కలిగించాలని కోరారు. ఈ కూర్పులో ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల, నేపథ్యాల ప్రజల అభిప్రాయాలకు పెద్దపీట వేయాలని నిర్ణయించడం జరిగింది.

Name :* Gender :*
Email ID :* Phone No :*
Suggestion/Opinion :*
Characters Remaining  
Captcha :      
Captcha letters are case sensitive